- 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కుషాయిగూడ/మల్కాజ్ గిరి, వెలుగు: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ రోడ్డులో గల ఎలైట్ కేఫ్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్ పై పోలీసులు సోమవారం రైడ్చేశారు.
అక్కడ ఉన్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో ఒక ఫ్లేవర్, 20 ఫిల్టర్లు, 6 హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెంటర్ యజమాని ఎస్వీ రావు, మేనేజర్ దిలీప్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
